ప్రేమమ్ మూవీతోటే యూత్‌ని ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి.. తాజాగా వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ‘ఫిదా’ చేసేసింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘ఫిదా’ మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తికాదు. మలయాళీ అయినప్పటికీ తెలుగు అందులోనూ తెలంగాణ యాసను నేర్చుకుని ‘బాద్మాష్ బొక్కలిరిగిపోయాయ్ బలిసిందారా’ అంటూ.. ఈ సింగిల్ పీస్ పిల్ల బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేస్తుంది. తెలుగులో తన మొదటి సినిమాతోనే అందరినీ ఫిదా చేసేసింది ఈ బ్యూటీ.
ఫిదా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులని ఫిదా చేసిన సినిమా. ఈ సినిమాతో హీరో కి కూడా రాణి క్రేజ్ హీరోయిన్ సాయి పల్లవి కి వచ్చేసింది. భానుమతి క్యారెక్టర్ తో జనాల మనసుల్లో స్థానం పొందిన ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజీ పర్సన్ సాయి పల్లవి. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమె యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఆమెకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు.
ఈ ముద్దుగుమ్మను సాయి పల్లవి అని పిలువడం మానేసి భాన్సువాడ భానుమతి అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలో వేదిక ఏదైనా గానీ, కార్యక్రమం ఏదైనా సాయి పల్లవి నామస్మరణతో మార్మోగిపోయింది. హీరోలుందరూ ఆసక్తి ఎదురు చేసేంతగా సాయి పల్లవి క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది. ఇటీవల జరిగిన ఫిదా సంబురాలు కార్యక్రమంలో సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు. సాయి పల్లవి లేకుండా ఫిదాను ఊహించుకోవడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఫిదా సినిమాకు సాయి పల్లవి గుండెకాయ అని శేఖర్ కమ్ముల పేర్కొనడం గమనార్హం. శేఖర్ కమ్ముల మాటను బట్టి చూస్తే ఫిదా విజయంలో ఆమె పాత్ర ఏంటో అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు ఈ భామకు ఉన్న క్రేజ్ దృష్టా ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచిందని తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవడం లాంటిదనే మాట చెబుతున్నారు. తన క్రేజ్‌ను బట్టి సాయి పల్లవి డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదంటున్నారు సినీ ప్రముఖులు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. నాగశౌర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. నానీతో ఎంసీఏ సినిమాలో చేస్తోంది. ఇంకా ఓ తమిళ చిత్రాన్ని అంగీకరించినట్టు ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంకా కొన్ని చిత్రాలను అంగీకరించాల్సి ఉంది అని ఆమె చెప్పారు. మొత్తానికి సాయి పల్లవి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు జోరు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా అశ్చర్యపోనక్కలేదు.