హర్రర్‌ మూవీలో ఫిదా భామ..

258
Sai Pallavi Naga Shourya film is Kanam
- Advertisement -

సాయి పల్లవి నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ అమ్మడు ఎక్కడ అడుగుపెట్టినా నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. మలయాళంలో తీసిన మొదటి రెండు సినిమాలతోనే అక్కడ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది. తెలంగాణ యాసలో సాయి పల్లవి ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫిదా సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్‌ను అందుకొని వరుస ఆఫర్లను అందుకుంటోంది.

Sai Pallavi Naga Shourya film is Kanam

అయితే ఇప్పుడు సాయిపల్లవి కోలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. విజయ్ దర్శకత్వంలో ‘కరు’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఏకకాలంలో తమిళ్‌-తెలుగులో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ‘కణం’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సాయి పల్లవి ఇంతకు ముందు వచ్చిన చిత్రాలకు బిన్నంగా హర్రర్ కథతో రాబోతోంది. ఆమెకు జోడిగా నాగ శౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సనిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -