కోలీవుడ్ స్టార్ తో సాయిపల్లవి…

234
saipallavi
- Advertisement -

ఫిదా చిత్రంతో యువకుల మనసు దోచుకున్న సాయిపల్లవి హీరో సూర్యకు గాలం వేస్తోంది. మలయాళంలో నటించిన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాతో అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను పొందింది సాయిపల్లవి. దీంతో కోలీవుడ్ కన్ను పల్లవిపై పడింది. ఇప్పుడు తమిళంలోను ఈఅమ్మడుకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.

 DRZXFw5VwAAbAzW

హీరోయిన్ గా మారకముందే సూర్యను కలవాలని, అతడితో కనీసం ఒక సెల్ఫీ దిగినా చాలని అనుకునేది సాయిపల్లవి. హీరోయిన్ అయిన తర్వాత సూర్య సరసన నటించే అవకాశం కోసం ఎదురుచూసింది. ఇప్పుడా టైం రానే వచ్చింది. సూర్యతో నటించే అవకాశం సాయిపల్లవి సొంతం చేసుకుంది. 7జి బృందావన కాలనీ వంటి బంపర్ హిట్ సినిమాలు తీసిన సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కాగా మరో ప్రత్యేక పాత్రకోసం సాయిపల్లవిని తీసుకున్నారు. ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

surya-and-sai-pallavi

కోలీవుడ్ లో సూర్య, సెల్వరాఘవన్ ది క్రేజీ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో సినిమా కోసం అక్కడి జనాలు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. కెరీర్ లో తన 36వ సినిమాతో అటు సెల్వ రాఘవన్ కు, ఇటు సాయిపల్లవికి ఒకేసారి ఛాన్స్ ఇచ్చాడు సూర్య. తెలుగు, మలయాళ భాషల్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న ఈమెకు కోలీవుడ్ లో మాత్రం సరైన బ్రేక్ రాలేదు. సూర్య సినిమాతో తమిళనాట కూడా స్టార్ డమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది.

- Advertisement -