మెగా హీరో సాయి తేజ్ చాలాకాలం తర్వాత వరుసగా చిత్రలహరి మరియు ప్రతిరోజూ పండుగే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలు ఇచ్చిన బూస్ట్‌తో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని చేశాడు. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ విడుదల అగిపోయింది. అంతేకాదు మరో సినిమా దర్శకుడు దేవా కట్టతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ మెగా హీరో పెళ్లి గురించి తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజూ మాట్లాడుతూ, 33 ఏళ్లు వచ్చేశాయని… పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం ఇక కష్టమేనని తెలిపాడు. ఈ ఏడాదే తన పెళ్లి ఉండొచ్చని, ఇంట్లో వాళ్లు అదే పనిలో ఉన్నారని చెప్పాడు. ఏమో అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమోనని సరదా వ్యాఖ్యలు చేశాడు. అలాగే స్కూల్ డేస్ తర్వాత ఇన్ని రోజులు ఇంటి వద్ద ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాడు. లాక్ డౌన్ బోరుగా ఉన్నప్పటికీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పదని చెప్పాడు.