సెప్టెంబ‌ర్ నుంచి తేజ్ ‘చిత్ర‌ల‌హ‌రి’ ప్రారంభం..

262
sai dharam tej
- Advertisement -

సుప్రీమ్ స్టార్ సాయి ధ‌ర‌మ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా..ఇటివ‌లే ఆయ‌న న‌టించిన ఆరు సినిమాలు వ‌రుస ప‌రాజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. దింతో త‌న త‌రువాతి సినిమాపై చాలా కేర్ తీసుకుంటున్నాడు తేజ్. ప్ర‌స్తుతం లావు త‌గ్గే ప‌నిలో ఉన్నాడు ఈమెగా హీరో. స‌రైన మెకోవ‌ర్ కోసం అమెరికాలో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రం భారీ డిజాస్ట‌ర్ ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

 tej i love u movie

త‌న త‌రువాతి సినిమా ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తో చేయ‌నున్నాడు. ఆగ‌స్టు చివ‌రి వారంలో ఇండియా వ‌చ్చి..సెప్టెంబ‌ర్ మొద‌టి వారంనుంచి షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు. కిషోర్ తిరుమ‌ల‌పై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు తేజ్. ఈమూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ అయిన‌టువంటి మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల‌కు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో ఈసినిమాపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు.

sai dharam tej, kishore tirumala

నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా అంత పెద్ద‌గా క‌లెక్ష‌న్ల‌ను రాబట్ట‌లేక‌పోయాయి. తేజ్, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాకు చిత్ర‌ల‌హ‌రి అనే టైటిల్ ను ప‌రిశిలించ‌గా..బార్ అండ్ రెస్టారెంట్ అనే ట్యాగ్ లైన్ ను పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈసినిమాతోనైనా ఈమెగా హీరో ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

- Advertisement -