ప్రీ లుక్: జవాన్

244
Sai Dharam Tej Jawaan Pre Look
- Advertisement -

విన్నర్‌ మూవీతో నిరాశపర్చిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ లేటెస్ట్ మూవీ జవాన్. అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తుండగా బి వి ఎస్ ర‌వి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సాయిధరమ్ తేజ సరసన కృష్ణగాడి వీర ప్రేమకథ మూవీ ఫేమ్ నటిస్తుండగా  SS థమన్ సంగీతం అందిస్తున్నాడు.

దేశ‌మా , కుటుంబ‌మా అనే వెరైటీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ తాజాగా విడుద‌ల చేశారు. భారీ వ‌ర్షంలో ప‌రిగెత్తుతున్నట్టుగా ఉన్న వ్య‌క్తి ని షాడోగా ప్రీ లుక్ లో చూపించారు. ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో తమిళ నటుడు ప్రసన్న నటించనున్నాడు. కోట శ్రీనివాస‌రావు కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ చిత్రం తేజూ కెరియ‌ర్ కి మంచి బూస్ట‌ప్ ఇస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Sai Dharam Tej Jawaan Pre Look

- Advertisement -