బాలయ్యను చూసి భయపడుతున్న జవాన్‌‌..

240
- Advertisement -

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ లేటెస్ట్ మూవీ జవాన్. అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మిస్తుండగా బి వి ఎస్ ర‌వి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘జవాన్’ సినిమా పోస్టర్స్ కు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలనుకున్నా. పోటీ ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు.

Sai Dharam Tej Jawaan movie Release Date

ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ‘పైసా వసూల్’ ను సెప్టెంబర్ 29న విడుదల చేయాలనుకున్నారు. ఆ సమయంలో పోటీ ఎక్కువ కావడంతో .. థియేటర్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో సెప్టెంబర్ మొదటివారంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దాంతో ఇప్పుడు ‘జవాన్’ సినిమా టీమ్ కి టెన్షన్ పట్టుకుంది. బాలకృష్ణ సినిమాకి పోటీకి దిగడం అంటే కొంచెం ఆలోచించుకోవలసిన అవసరం వుంది. ‘జవాన్’ టీమ్ సభ్యులు అదే పని చేస్తున్నారట. బహుశా ఈ సినిమాను రెండవ వారానికి వాయిదా వేసుకోవచ్చుననే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -