‘ఇంటిలిజెంట్‌’ ట్రైలర్‌..

232
- Advertisement -

సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తేజూ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ఈ ట్రైల‌ర్‌లో చూపారు.. ల‌వ్, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు యాక్ష‌న్ సీన్స్‌తో ఈ ట్రైల‌ర్ ను క‌ట్ చేశారు.. వివివినాయ‌క్ నుంచి మంచి మాస్ మ‌సాలా సినిమా గా ఈ ఇంటిలిజెంట్ క‌నిపిస్తున్న‌ది. ”వాడు చంపేది కిరాత‌కంగా ఉంది.. కానీ ఫాలో అయ్యేది ఇంట‌లెక్చువ‌ల్‌గా ఉంది”.. అంటూ విల‌న్ పాత్ర‌ధారి రాహుల్ దేవ్ చెప్పే డైలాగ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌క‌నే చెబుతోంది. లావ‌ణ్య త్రిపాఠి నాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.

Sai Dharam Tej Inttelligent Movie Trailer

ఈ మూవీలో సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృ థ్వీ, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించారు.

- Advertisement -