దేశభక్తిని చాటుకున్న మెగా హీరో‌..

227
Sai Dharam Tej congratulates ISRO
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం ‘జవాన్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరం తేజ్ కొంచెం డిఫరెంట్‌ హీరోయిజం చూపిస్తాడు.అయితే మెగాఫ్యామిలీలో మిగిలిన హీరోలు అంతా మెగాస్టార్, పవర్ స్టార్ ని ఇమిటేట్ చేసేందుకు వెనకాడుతుంటారు.మరి తేజు మాత్రం నిర్మొహమాటంగా వారిని దించేస్తాడు. యాక్టింగ్ కాని డ్యాన్స్‌లు కాని మామలను గుర్తుకు తెచ్చేలా ఉంటాయి.. ఫైట్స్ నుంచి పోజుల వరకూ ప్రతీ విషయంలో వారిని గుర్తు చేసేందుకు ఏ మాత్రం వెనకాడడు. ఇప్పుడీమెగా హీరో దేశభక్తి యాంగిల్‌లో జవాన్‌ చిత్రంలో నటిస్తున్నాడు.

Sai Dharam Tej congratulates ISRO

బహుశా కొన్ని నెలలుగా దేశభక్తి గురించిన సన్నివేశాలలో నటించడం కారణంగా అనుకుంటా.. రీసెంట్ గా ఇస్రో సక్సెస్ ఇతడిని బాగా ఇన్ స్పైర్ చేసేసింది. ఇస్రో ఘనతను సోషల్ మీడియాలో పొగడకుండా ఉండలేకపోయాడు. ఆ ప్రశంసలు కూడా అలా ఇలా కాదు.. సినిమాలతో పోల్చి మరీ.. ఇస్రో సాధించిన విజయమే గొప్ప అని చెప్పడం విశేషం. ‘ఒక సినిమా 50 రోజులు ఆడడం.. ఒ క్రికెట్ ప్లేయర్ 50 రన్స్ చేయడం సాధారణంగా జరిగేదే. అయితే వాటి కంటే మన అంతరిక్ష సంస్థ ఇస్రో సక్సెస్ ఫుల్ 50 శాటిలైట్స్ ను లాంఛ్ చేయడమే చాలా గొప్ప విషయం’ అంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్ పెట్టాడు ఈ జవాన్‌.

సాయిధరమ్ తేజ్ వరుస సక్సెస్ ల తర్వాత తిక్క.. విన్నర్ సినిమాలు ఫ్లప్‌ కావడంతో జవాన్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఇక ఈ సినిమా కుటుంబ సభ్యులందరితో కలిసి చూసే విధంగా ఉంటుందని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. జవాన్‌ ”ఇంటికొక్కడు” అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి రీసెంట్ గా ఇచ్చిన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Sai Dharam Tej congratulates ISRO

- Advertisement -