నాన్నా అనే పిలుపుతో ఏడుపొచ్చింది..

210
Sai Chand sai pallavi
- Advertisement -

ఇప్పుడు ఎవరి నోట విన్న ఒకటే మాట.. ఫిదా.. ఫిదా.. ఫిదా.. సినిమా యూనిట్ కూడా ఊహించని రెంజ్ లో ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో నటించిన సాయి పల్లవి దగ్గర నుంచి బుజ్జి కార్యెక్టర్ చెసిన బాబు వరకు ప్రతి ఒక్కరికి ఓ రెంజ్ లో క్రేజ్ వచ్చింది. సాయి చంద్ పాతికేళ్ళ క్రితమే మా భూమి చిత్రంతో తన టాలెంట్ ఏంటో చూపించారు. హీరోగానే కాకుండా.. సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీనియర్ హీరోల సినిమాలు అన్నింటిలోను నటించాడు. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఉన్నట్లు ఉండి.. ఆయన సినీ పరిశ్రమకు నుంచి మాయం అయ్యారు.

ఇప్పుడు ఫిదా సినిమాలో ఆయను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. చాలా సహజంగా, మేకప్ వేసుకుని రెండు దశాబ్దాలు దాటుతున్నా.. అవి తెలియనివ్వకుండా.. చాలా బాగా చేశారు. తాను సరైన సినిమాతోనే సినిమాల్లోకి పునరాగమనం చేశానని భావిస్తున్నట్లు సాయిచంద్ చెప్పారు. ఈ సినిమా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసిందని సాయిచంద్ తెలిపారు.సినిమా షూటింగ్ సందర్భంగా సాయిపల్లవితో కలిసి కొన్నాళ్లు ప్రయాణం చేశాక.. తనకు తండ్రితనం అంటే ఏంటో తెలిసొచ్చిందని సాయిచంద్ చెప్పారు.

 నిజ జీవితంలో  తాను పెళ్లి చేసుకోలేదని.. తండ్రి కాలేదని.. ఐతే ‘ఫిదా’ సినిమా చేయడం ద్వారా తాను నిజంగా తండ్రి అయిపోయిన భావన కలిగిందని ఆయనన్నారు. ఓ రోజు షూటింగ్ ముగించుకుని వెళ్తుంటే.. వెనుక నుంచి సాయిపల్లవి ‘నాన్నా’ అని పిలిచిందని.. తర్వాత తన దగ్గరికొచ్చి హత్తుకుందని.. ఆ సమయంలో తనకు అనుకోకుండా కన్నీళ్లు వచ్చేశాయని.. సాయిపల్లవిని నిజంగానే తన కూతురిగా భావించానని.. ఆమె టేక్ కేర్ అంటున్నపుడల్లా తన రూపంలో ఒక డాక్టర్ తనకు అండగా ఉందన్న భరోసా కలిగిందని సాయిచంద్ చెప్పారు. సాయి పల్లవి గొప్ప నటి. చిన్న వయసులో అంతటి నటనా పరిణతి ఓ నటిలో చూడటం ఇదే తొలిసారి అని సాయి చంద్ అన్నారు.

- Advertisement -