‘సాహో’ టీజర్‌.. అదిరిపోయింది..

165
Sahoo Movie Teaser REleased
- Advertisement -

ఒక వైపు బాహుబలి 2 సినిమా రిలీజ్ కి రెడీ కాగా, మరో వైపు ఫ్యాన్స్‌ ఆనందాన్ని మరింత పెంచేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డిసైడైపోయాడు. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ చిత్ర టీజర్‌ విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌లో ప్రభాస్‌ రక్తమోడుతూ కూర్చుని చూస్తుండగా, ‘ఆ రక్తం చూస్తేనే అర్థమవుతోంది రా! వాడిని చచ్చేలా కొట్టారని’ అంటూ వెనుక నుంచి ఓ వ్యక్తి గొంతు వినిపిస్తుంది.

  Sahoo Movie Teaser REleased

‘సార్‌.. ఆ రక్తం వాడిది కాదు.. మనవాళ్లది’ అని మరో గొంతు సమాధానం ఇవ్వడం, ముఖంపై పడిన రక్తాన్ని తుడుచుకుంటూ ప్రభాస్‌ ‘ఇట్స్‌ షో టైమ్‌’ అంటూ చిన్నగా నవ్వుతూ పలికే డైలాగ్‌ అదిరిపోయేలాఉంది.

టీజర్‌ను చూస్తుంటే హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇప్పటివరకూ ‘సాహో’లో కథానాయిక ఎవరన్నదీ ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ సంగీత త్రయం శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు

   Sahoo Movie Teaser REleased

ఇదిలా ఉంటే..ఈ చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్నట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని అందించనున్నారు. ఇక ‘ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఐదు సంవత్సరాల నుండి ప్రభాస్ ని ఒకే గెటప్ లో చూసిన ఆడియన్స్ కి ఈ టీజర్ చాలా థ్రిల్ ని కలిగిస్తుంది.

- Advertisement -