రివ్యూ : సాహో

1936
sahoo movie review
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంరానే వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ నటించగా సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు…?అసలు సాహో కథ ఏంటి..?సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..

కథ:

ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీతో కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుడిని చేయాలనుకుంటాడు. కానీ పృథ్వీ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌) రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో రాయ్ చనిపోవడం, రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. అదేటైంలో ముంబైలో పెద్ద దొంగతనం జరుగుతుంది..ఈ కేసును చేదించడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలిసి ప్రభాస్‌…కేసును ఎలా చేధించాడు..?ఈ క్రమంలో వీరిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు..చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేదే సాహో కథ.

Image result for sahoo stills

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ప్రభాస్‌,యాక్షన్ సీన్స్,నిర్మాణ విలువలు. తన నటనతో సినిమాను హైపిచ్‌కు తీసుకెళ్లాడు ప్రభాస్‌. అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ నటన చూపించాడు. పోలీసు ఆఫీసర్‌గా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. ప్రభాస్‌- శ్రద్ధా మధ్య లవ్ ట్రాక్ బాగుంది. గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. మిగితా పాత్రల్లో జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సాంగ్స్, కామెడీ లేకపోవడం. ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా మూవీ నడుస్తుంది. మిగిలిన పాత్రలకు అంతగా అవకాశం లేదు. దేవరాజ్‌ పాత్ర తప్ప మిగిలిన డాన్‌లు అంత పవర్‌ఫుల్‌గా లేకపోవడమూ ఓ లోటు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. హాలీవుడ్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్‌ సినిమాను తెరకెక్కించాడు. భారీ యాక్షన్‌ సీన్లతో తెలుగు తెరను హాలీవుడ్‌ స్టైల్‌ ఫైట్లతో నింపేశారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్ సూపర్బ్. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for sahoo

తీర్పు:

యాక్షన్‌ – ప్రేమను మిళితం చేసి సుజీత్ తెరకెక్కించిన చిత్రం సాహో. తెలుగు తెరపై హాలీవుడ్ మూవీని చూపించాడు సుజీత్. ప్రభాస్,శ్రద్ధా నటన సినిమాకు ప్లస్ కాగా గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు అన్ని సినిమాలో ఉన్నాయి. కామెడీ లేకపోవడం మైనస్ కాగా ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులు మెచ్చే మూవీ ‘సాహో’.

విడుదల తేదీ: 30/08/2019
రేటింగ్:3/5
నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌
సంగీతం: తనిష్క్‌ బగ్చీ
నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌
దర్శకత్వం: సుజీత్‌

- Advertisement -