వేదమంత్రోచ్చారణల మధ్య రెండోరోజు చండీయాగం

291
kcr chandi yagam
- Advertisement -

తెలంగాణలో సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండేలా, అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగేలా, బంగారు తెలంగాణ కల సాకారమయ్యేలా దైవానుగ్రహం కోసం కేసీఆర్‌ చేపట్టిన మహారుద్రసహిత సహస్ర చండీయాగం రెండోరోజుకు చేరుకుంది.

ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం వేదమంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిధ్వనించాయి.ఆధ్యాత్మికశోభతో ఎర్రవల్లి సరికొత్త శోభను సంతరించుకుంది.

ఇవాళ సాయంత్రం యాగం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి హర్షవర్థన్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. యాగం చేస్తున్న వ్యక్తి వేరేచోట నిద్రించకూడదు కాబట్టి కేసీఆర్ తిరిగి ఎర్రవల్లికి చేరుకుని మూడోరోజు యాగక్రతువులో పాల్గొననున్నారు.

విశాఖనుంచి ప్రత్యేకంగా వచ్చిన శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి సమక్షంలో మేళతాళాలలో, మంత్రోచ్చారణతో యజ్ఞం సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాగం నిర్వహిస్తున్న రుత్వికులకు వ్యవసాయంక్షేత్రంలోనే బసచేసేలా ఏర్పాట్లు చేశారు. బయటివ్యక్తులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.

- Advertisement -