సగ్గుబియ్యంతో ఆ సమస్యలు దూరం..!

76
- Advertisement -

సగ్గుబియ్యం గురించి మనందరికి తెలిసే ఉంటుంది. కర్రపెండలం నుంచి వీటిని తయారుచేస్తారు. చూడడానికి ముత్యాల్లా తెల్లగా ఉండే సగ్గు బియ్యని భారతీయ వంటకాల్లో విరివిగా వాడతారు. ముఖ్యంగా పాయసం, కిచిడీ, పాలకోవా,.. వంటి వివిధ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సగ్గుబియ్యం తినడం వల్ల ఎన్నో ప్రయోజనలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు చాలావరకు దూరం అవుతాయి. సగ్గు బియ్యంలో ప్రోటీన్ శాతం మరియు కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువే. కాబట్టి బరువు పెరగాలనుకునే వారు తినే ఆహారంలో సగ్గుబియ్యం ఉండేలా చూసుకోవాలి. .

అయితే సగ్గుబియ్యని లిమిట్ గా తీసుకుంటే కొలెస్ట్రాల్ శాతం కూడా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సగ్గుబియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు సగ్గుబియ్యం ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఐరన్ సమృద్దిగా అందితే రక్త హీనత సమస్య ఉండదు. అలాగే కాల్షియం కారణంగా ఎముకల పటుత్వం పెరుగుతుంది.

సగ్గుబియ్యంతో జావ తయారు చేసుకొని తాగుతుంటారు చాలమంది. ఈ రకంగా తాగడం వల్ల ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం వంటి సమస్యలు సగ్గుబియ్యంతో చేసిన జావ తాగితే వాటి నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సగ్గుబియ్యాన్ని సలాడ్ రూపంలో కూరగాయలతో కలిపి తీసుకుంటే మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు బాడీకి అందుతాయట. వంట్లో వేడి ఉన్నవాళ్ళు సగ్గుబియ్యంతో చేసిన గంజి తాగితే చలువ చేస్తుందని మన పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. కాబట్టి సగ్గుబియ్యని ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ తీసుకోవవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలగడంతో పాటు ఆయా రకాల రుగ్మతలు కూడా దూరమౌతాయట.

Also Read:పుష్ప -2..రష్మికా బర్త్ డే గిఫ్ట్

- Advertisement -