TTD: సాధు సుబ్రమణ్య శాస్త్రి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం

2
- Advertisement -

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు ఆదర్శనీయమని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఉమ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి సభ అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య ఉమ “ శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి పరిశోధన “ అనే అంశంపై మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసి శ్రీ సుబ్రమణ్య శాస్త్రి స్వామివారికి అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు.

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచాలు “ తాళ్లపాక వారి సాంస్కృతిక శాసనాలు ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, తాళ్లపాక వారి 41 శాసనాలలో దేవాలయాల వ్యవస్థ, దాతలు ఇచ్చిన దానాలు, వాటి వినియోగ పద్ధతి, నాటి పాలన, అర్చకులు, పరిపాలన అధికారులు, సేవకులు తదితర అంశాలు వివరించినట్లు తెలిపారు. తాళ్లపాకవారి సాహిత్యం శాసనాల ద్వారా, రాగి రేకుల ద్వారా మనకు అందుతున్నాయని చెప్పారు. తాళ్లపాక వారి శాసనములపై పరిశోధనలు చేసి పరిష్కరించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రికి తెలుగు ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన వివరించారు.

Also Read:TTD: శ్రీవారికి తీర్థ కైక‌ర్యం చేసిన తిరుమలనంబి

- Advertisement -