9వ రోజు..సద్దుల బతుకమ్మ

6
- Advertisement -

తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో.. ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

ఇవాళ సద్దుల బతుకమ్మతో పూల పండగ సంబరాలు ముగియనున్నాయి. గ్రామీణులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు చేస్తారు. అందుకే చివరిరోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు. సాయంత్రం కాగానే పిల్లాజెల్లా అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలివస్తారు.

Also Read:Bigg Boss 8 Telugu: అందరి టార్గెట్ యష్మీనే

- Advertisement -