తెలంగాణ ఆడపడచులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. నేటితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. కరోనా వేళ ఎవరికి వారే పరిమితంగా బతుకమ్మ ఆటలాడుతుండగా…మార్కెట్లలో రంగు రంగుల పూల కొనుగోలు చేసేందుకు బారులు తీరడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.
గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనం తదితర రంగు రంగుల పూలను సేకరించారు. కరోనా వ్యాప్తి క్రమంలో నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఆడ పడుచులకు పలువురు గవర్నర్ తమిళసైతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.