అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆదివారం మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా నష్టపోయిన ఆదుకునేందుకుగాను బుష్‌ఫైర్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సచిన్, యువీ సహా ఎంతోమంది లెజెండరీ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు.
భారత్ నుంచి సచిన్ కోచ్ పాత్ర పోషిస్తుండగా యువీ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోని రెండు జట్లకు ఒకవైపు పాంటింగ్, మరోవైపు గిల్‌క్రిస్ట్ సారథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ శనివారమే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఆదివారానికి వాయిదా పడింది.
గిల్‌క్రిస్ట్ లెవన్ జట్టు: గిల్‌క్రిస్ట్, వాట్సన్, హోడ్జ్, యువరాజ్ సింగ్, బ్లాక్‌వెల్, సైమండ్స్, వాల్ష్, రీవోల్ట్, సిడిల్, పవాద్ అహ్మద్. కోచ్: టిమ్ పైన్
పాంటింగ్ లెవన్ జట్టు: హేడెన్, లాంగర్, పాంటింగ్, విలానీ, లారా, లిచ్‌ఫీల్డ్, హాడిన్, బ్రెట్‌లీ, వసీం అక్రమ్, డాన్ క్రిస్టియాన్, ల్యూక్ హోడ్జ్. కోచ్: సచిన్