సచిన్‌ కెరీర్‌లో మర్చిపోలేని సంఘటన..

316
sachin tendulkar
- Advertisement -

క్రికెట్ ఓ మతమైతే..ఆ మతానికి దేవుడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రీడాభిమానులకు స్పూర్తి..లిటిల్ మాస్టర్‌ సచిన్ టెండుల్కర్‌. జెంటిల్మన్‌ గేమ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్‌ లెజెండ్‌గా క్రికెట్‌ హిస్టరీలో మిగిలిపోయాడు.భారత్‌కు అద్భుత విజయాలను అందించిన సచిన్‌ ప్రస్తుతం ప్రపంచకప్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌లో మర్చిపోలేని సంఘటనను గుర్తు చేసుకున్నారు.

2003 ప్రపంచకప్‌లో మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ప్రతీ భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే దాయాది పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ వీరోచితంగా పోరాడి 98 పరుగులు చేసి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన సచిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

పాక్‌ను మట్టికరిపించిన జోష్‌లో ఉన్న టీమిండియాకు సంబరాలు చేసుకోవాలని అనిపించిందట. మ్యాచ్‌ పూర్తయ్యేసరికి బాగా పొద్దు పోవడంతో భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. ఈ సందర్భంగా తన చేతిలో ఉన్న ఓ పార్శిల్‌ను తన ఫ్రెండ్‌కు ఇచ్చాడట సచిన్‌. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడట. అయితే ఆ పార్శిల్‌ను సచిన్ ఫ్రెండ్ ఓ రెస్టారెంట్‌లో మర్చిపోవడంతో ఆందోళన చెందిన సచిన్‌ ఆ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి ఆ పార్శిల్‌ను తెప్పించుకున్నాడట. ఇంతకీ ఆ పార్శిల్‌ కవర్‌లో ఉన్నవేంటో తెలుసా..!.అప్పటివరకు  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుల కింద వచ్చిన మూడు బంగారు వాచీలు.

- Advertisement -