క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్‌తో కలిసి లంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. మనల్ని సన్నిహితంగా ఉంచే రెండు విషయాలు స్నేహం, ఆహారం. అద్భుతమైన లంచ్ అని ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
టీమిండియా క్రికెట్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు అజిత్ అగార్కర్. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత చేతన్ శర్మ రాజీనామా చేయడంతో చీఫ్ సెలక్టర్ స్థానం ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉంది. దీంతో చీఫ్ సెలక్టర్ పదవి కోసం జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించగా సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, శివ్ సుందర్ దాస్‌తో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ.. అజిత్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
Also Read:ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే..!
భారత జట్టు అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించారు అగార్కర్. 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన అగార్కర్… టెస్టుల్లో అతను 58 వికెట్లు తీయగా, వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు.
Also Read:బండి సంజయ్ పనైపోయిందా..?