క్రికెట్ లో సచిన్ మార్క్ చెదరనిది. క్రికెట్ లో తాను సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఈ క్రికెట్ దిగ్గజం ఇవాళ 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్ గా సచిన్ రికార్డుల్లో నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ మొత్తం 34,357 రన్స్ చేశాడు. అంతేకాదు బౌలింగ్ లోనూ 200 వికెట్లు తీసుకున్నాడు.
అయితే క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన సచిన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2013లో సచిన్ రిటైరైన విషయం తెలిసిందే.
ఇక అభిమానం అవధులు దాటినా కొన్ని సార్లు మంచే జరుగుతుందనే మాట సచిన్ విషయంలో అక్షరాలా రుజువైంది. దాదాపు 80శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న పదకొండేళ్ళపిల్లాడ్ని..ఇక జీవితంలో నడవలేడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కానీ సచిన్‌లను చూడగానే లేచి నిలబడి, సచిన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. కానీ ఈ ఉదంతం గురించి బోరియా మజుందార్ అనే రచయిత తన ‘లెవెన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్’ అనే బుక్ లో రాశారు. ”చాలా ఏళ్ల క్రితం చెన్నైలోని చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ బాలుడు నడవలేడని డాక్టర్లు చెప్పిన విషయం సచిన్‌కు తెలియదు. దీంతో ఆ బాలుడి వద్దకు వెళ్లి అతడి చేతికి బ్యాట్ ఇచ్చి ఆడమన్నాడు. ఆ బాలుడు లేచి సచిన్ విసిరిన మూడు బంతులు ఆడాడు” అని మజుందార్ వివరించారు.
ఈ ఘటనతో ఆ పిల్లవాడు 75-80శాతం వరకూ లేచి నిలబడలేడని తేల్చేసిన డాక్టర్ల మాటలను పక్కన పెట్టేలా మాస్టర్ సచిన్ ఆ పిల్లవాడిని నిలబెట్టాడని తెలిపారు,
కాగా..45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సచిన్ కు క్రికెట్ లవర్స్ బర్త్‌డే విషెస్ చెప్తూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
As @sachin_rt celebrates turning 45 today, we're taking a look at 45 things we love about the little master! ❤️
1-11 ➡️ https://t.co/j0yqO5xcjH#Sachin45 pic.twitter.com/SgY1LbCOuu
— ICC (@ICC) April 24, 2018