Sabitha Indrareddy:తనను టార్గెట్ చేయడంపై సబితా ఫైర్

12
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా రెడ్డి – సీఎం రేవంత్ రెడ్డి మాటల యుద్ధం జరిగింది. కొంతమంది అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది అంటూ సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి.

ఒక తమ్ముడుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే ఆశీర్వదించాను. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. సీఎం స్థాయికి వెళ్తావ్ అని చెప్పానని అన్నారు. ప్రతీ సభలో తనను టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఒక ఆడబిడ్డను ఎందుకు అవమానిస్తున్నావ్.. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి.. నాఇంటిపై వాలడానికి వీలులేదని చెప్పారు.. ఈ రోజు ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారంటూ అని ప్రశ్నించారు.

మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను తప్ప వేరే ఉద్దేశం లేదని తెలిపారు రేవంత్.

Also Read:Olympics 2024: ప్రీ క్వార్ట‌ర్స్‌లోకి పీవీ సింధు

- Advertisement -