తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా? పండుగలు వచ్చినప్పుడు తెలంగాణలో దావత్ లు చేసుకోవడం కామన్ అని ప్రశ్నించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదు కానీ రాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారు…ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న కుట్ర అని దుయ్యబట్టారు.
ఇప్పటివరకు తెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవు…. ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురాకండి అన్నారు. ఇలాంటివి ప్రతిపక్షాలపై కావాలని చేసే కుట్రలు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కేటీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక.. కుట్రలు చేస్తున్నారు. జన్వాడలో ఏం దొరకలేదని గచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు అన్నారు. కేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. పోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి, కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు…కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందన్నారు.
Also Read:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ:రేవంత్