ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి?

4
- Advertisement -

ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మీడియాతో మాట్లాడిన సబితా.. కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణం అన్నారు. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయి..రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరం అన్నారు. పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటసారి… హోంమంత్రి లేకపోవటం వల‌న.. కానిస్టేబుల్స్ బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

యూనిఫాం వేసుకుని దర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని…అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలి…18రోజులకు‌… 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్దతిని కొనసాగించాలి అన్నారు. పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితులు పోలీస్ కుటుంబాలవి…మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయి అన్నారు. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.

పోలీస్ వ్యవస్థ లో జరుగుతున్న తీరును చూస్తుంటే మనస్సు కలచి వేస్తుందన్నారు ఎమ్మెల్సీ వాణిదేవి. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు నేను చూడలేదు..పోలీస్ లు ధర్నాలకు రావడం చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు అన్నారు. కానిస్టేబుల్ ల భార్యలు, కుటుంబ సభ్యులు ఈ విధంగా ధర్నాలు చేసిన ఘటన మాత్రం ఎక్కడ ఉండదు…ముఖ్యమంత్రి వద్దనే ఈ పోలీస్ వ్యవస్థ ఉంది ముఖ్యమంత్రి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ వ్యవస్థ ను కాపాడుకోవాలి..కరోన సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగలేదు అన్నారు.

Also Read:KTR:బోనస్ దేవుడెరుగు…మద్దతు ధరకే దిక్కులేదు

- Advertisement -