రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం:సబితా

7
- Advertisement -

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు.. బిల్డింగ్ కడితే చదువు రాదు, గతంలో ఉన్న మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకువస్తున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సబితా…ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు.. గురుకులాల్లో ఉన్న పిల్లలనా, లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలనా, లేదా కొత్త వాళ్ళను తీసుకు వస్తారా చెప్పాలి అన్నారు.

రేవంత్ రెడ్డి గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాడు… విద్యాశాఖమంత్రిగా రేవంత్ రెడ్డి గత ఏడాదిన్నర కాలంగా విద్యాశాఖలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు ? అన్నారు. గురుకులాల్లో డిగ్రీ, ఇంటర్ కాలేజీలు మూసివేయడమేనా మార్పంటే ?…ఏడాదిన్నర కాలంలో 2000 స్కూళ్లు మూసివేశారు ఇదేనా మార్పంటే ? చెప్పాలన్నారు.

పేద పిల్లలు చదువుతున్న గురుకుల పాఠశాలల్లో ఎందుకు ఇంత దుస్థితి ఉందని రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పట్టించున్నాడా ? –మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మొదటిలో 80 కోట్లు వేసిన అంచనా ఇప్పుడు 200 కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలి అన్నారు. అసలు 80 కోట్ల నుండి 200 కోట్లకు ఎలా అంచనా పెంచారు అంటే క్లారిటీ ఇవ్వాలి…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మీద ఒక్కోసారి ఒక్కో అంచనా పెంచుకుంటూ పోయారు అన్నారు.

ముందుగా ఉపముఖ్యమంత్రి 80 కోట్లు అంచనా వేస్తే, తర్వాత ముఖ్యమంత్రికి గారు 100 కోట్లకు అంచనా పెంచారు.. మళ్లీ తర్వాత అదే ముఖ్యమంత్రి గారు 120 కోట్లు అని అంచనా పెంచారు.. ఇప్పుడు మళ్లీ అదే ముఖ్యమంత్రి 200 కోట్లు అంచనా పెంచారు.. అసలు ఎందుకు అంచనా పెంచుకుంటు పోయారు.. అక్కడే మత్లబ్ ఏంటో చెప్పాలి అన్నారు.

Also Read:ఉగ్రపోరు..దేశమంతా ఏకతాటిపైకి!

- Advertisement -