రేవంత్ క్షమాపణ చెప్పాలి:సబితా

2
- Advertisement -

ఇది సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానం కాదు .. మహిళా సమాజానికి జరిగిన అవమానం అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి… సునీతా లక్ష్మారెడ్డి చీర లాగుతుంటే కేటీఆర్ జోక్యం చేసుకోకపోతే అక్కడే తొక్కేవారు..సమయానికి కేటీఆర్ రావడం వల్లే మేము సురక్షితంగా బయటపడ్డామం.. ప్రశ్నిస్తే చీర లాగడం, జుట్టు పట్టుకోవడం, గొంతు నొక్కడం ఏంటి? అని ప్రశ్నించారు.

మహిళా లోకానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి… అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల మీద జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అది రేవంత్ రెడ్డి ఆదేశాలతోనో, అతన్ని సంతృప్తి పరచడానికో జరిగిన దాడి అనే మేము భావిస్తున్నాము అన్నారు.

తెలంగాణ సమాజానికే ఇది మాయని మచ్చ…అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది అన్నారు. దేశ చరిత్రలోనే మహిళా ఎమ్మెల్యేలను ఇంతలా అవమానించడం ఎక్కడా జరగలేదు… నల్ల దుస్తులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.

Also Read:#NBK111 @’దాదా’

ఇది ఒక దుశ్శాసన చర్య..అసెంబ్లీ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే, రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఎక్కడిది ..ఇది కేవలం మాపై జరిగిన దాడి కాదు, మహిళా లోకాన్ని అవమానించేలా జరిగిన దాడి అన్నారు.

- Advertisement -