దివ్యాంగుల సంక్షేమంపై శ్రద్ధ ఏదీ?

14
- Advertisement -

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వంటి ముఖ్యమైన రోజును కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఆమె మండిపడ్డారు. “ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు… కనీసం అధికారులు కూడా ఈ రోజు ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకునే నాయకత్వం ప్రస్తుతం ప్రభుత్వంలో కనిపించడం లేదు” అని ఆమె విమర్శించారు.

సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన ముందు దివ్యాంగుల పెన్షన్ రూ.500 మాత్రమే ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి ఇబ్బందులు, పరిస్థితులను గుర్తించి పెన్షన్‌ను రూ.4,000 వరకు పెంచారని గుర్తుచేశారు. “దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌. వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నాం” అని ఆమె పేర్కొన్నారు.

కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆమె తీవ్రంగా ప‍రిశీలించారు. “రూ.4,000 పెన్షన్‌ను రూ.6,000కు పెంచుతామని గొప్పగా చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీని పూర్తిగా మరచిపోయింది. దివ్యాంగుల సంక్షేమం మీద కనీస శ్రద్ధ కూడా చూపడం లేదు” అని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

Also Read:MCD Bypoll:బీజేపీ ఏడు..ఆప్‌ మూడు!

- Advertisement -