పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు ఈ విషయమై సబితమ్మ సీఎం కేసీఆర్‌ను కూడా కలవడం జరిగింది. వీలైనంత త్వరలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సీఎం కేసీఆర్‌తోనే ఆమె చెప్పినట్టు సమాచారం. త్వరలోనే చేవెళ్ల భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్‌లో ఆమె చేరనున్నారు.. ఈ నేపథ్యంలో తాను టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నానో వివరించారు సబితా ఇంద్రారెడ్డి.
రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పార్టీ మారక తప్పదు. పార్టీ మార్పు విషయంలో నా యొక్క నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి అభివృద్ధి నిధులు రావాలంటే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాను. నా భర్త ఇంద్రారెడ్డి కుడా ప్రాంతీయ పార్టీలో పని చేశారు. 19 సంవత్సరాలుగా నాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు.అని తెలిపారు.
ఇక కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉందని అమె
అన్నారు. టీకేఆర్‌కు మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైడూర్యాలు లేవు. టీఆరెస్ పార్టీ లో నాతో పాటు చేరుతున్న వారు, టీఆరెస్ పార్టీ లో ఎప్పటి నుండో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో కలిసి మెలిసి ముందుకు సాగుతాం అని అన్నారు. రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.. జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని, అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నాట్లు ఆమె తెలిపారు.