శబరిమల వివాదంపై సుప్రీం కీలకనిర్ణయం

536
sabarimala
- Advertisement -

కేరళలోని శబరిమల వివాదంపై సుప్రీం కీలకనిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్ధానం ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు సీజేఐ రంజన్ గొగోయ్. ఈ కేసులో రివ్యూ పిటిషన్‌తో పాటు 65 పిటిషన్లు దాఖలయ్యాయని.. వీటిని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

మతమంటే ఏంటి? మత విశ్వాసాలు ఏమున్నాయి? అనే అంశంపై చర్చ జరపాలని పిటషనర్లు మమ్మల్ని కోరారని సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తెలిపారు. నిజానికి ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్చ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదన్నారు.

ఈ కేసు కేవలం ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాదు. మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశాన్ని కూడా పరిశీలించాలి అని పేర్కొన్నారు.

- Advertisement -