కేరళలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరిన మహిళలపై హిందూ సంస్థలు దాడికి పాల్పడ్డాయి. కొచ్చిన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తృప్తిదేశాయ్ బృందాన్ని అడ్డుకోవడంతో పాటు బిందు ఆమని అనే మహిళపై పెప్పర్ స్ప్రే చల్లడంతో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
దీంతో తృప్తి దేశామ్ బృందాన్ని కేరళ పోలీసు కార్యాలయానికి తరలించారు.శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం తమ హక్కు అని తెలిపారు తృప్తి దేశాయ్. సుప్రీం కోర్టు కూడా మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపిందని..ఆలయంలోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకోలేరని చెప్పారు.
గతేడాది బిందు స్వామివారి సన్నిధి దగ్గరి దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.మరోవైపు కేరళలో స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళలకు భద్రత కల్పించలేమని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sabarimala Live Updates: Activist Trupti Desai lands in Kochi to visit Ayyappa temple, Bindu Ammini attacked