విక్రమ్,కిర్తీల యూరప్ షెడ్యూల్..

234
Saamy Square’: Vikram and Keerthy Suresh to head to Europe
- Advertisement -

హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సామి 2’. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటిస్తోంది. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ఎప్పుడు డిఫరెంట్ పాత్రలతో ఇటు తెలుగు అటు తమిళంలో నటుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవటంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Saamy Square’: Vikram and Keerthy Suresh to head to Europe

శిబు థామీన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక తదుపరి షెడ్యూల్‌ యూరప్‌లో చిత్రీకరించబోతున్నారు చిత్ర యూనిట్. విక్రమ్ కీర్తిలపై అక్కడ కొన్ని సన్నివేశాలను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా కీర్తి సురేష్‌ నటించిన చిత్రం ‘మహానటి’. ఇటీవలె విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సావిత్రి పాత్రలో దర్శనమిచ్చి తన నటనతో సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంటోంది కీర్తీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు దూసుకోస్తున్నాయట.

ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్న కీర్తి విక్రమ్‌తో నటించే ఈ సినిమా విజయం సాధిస్తుందని అశిస్తున్నారు సినీ జనాలు. విక్రమ్ ఈ చిత్రంతో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేశాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది.

- Advertisement -