ఓటీటీలో కాదు థియేటర్‌లోనే..శివాజీ మూవీ!

4
- Advertisement -

నటుడు శివాజీ, లయ జంటగా నటించిన ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ సినిమా విడుదల విషయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా ఈటీవీ విన్ టీమ్‌తో కలిసి నిర్మించారు. మొదట ఫిబ్రవరి 12న ఈటీవీ విన్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఆ రోజు విడుదల కాలేదు.

తాజా సమాచారం ప్రకారం, చివరి నిమిషంలో శివాజీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయకుండా ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారట. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొంత సమయం తీసుకుని, భారీ ప్రమోషన్లు చేసి మార్చి మొదటి వారంలో థియేట్రికల్ రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఈటీవీ విన్ కూడా థియేట్రికల్ రిలీజ్‌లకు ప్రాధాన్యం ఇస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ముందుగా థియేటర్లలో విడుదలై, తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అలాగే ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్‌ను రీ-ఎడిట్ చేసి సినిమాగా థియేటర్లలో విడుదల చేయాలనే ప్రయోగం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ కూడా ముందుగా థియేటర్లలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, రంజిన్ రాజ్ సంగీతం అందించారు.

Also Read:IND vs PAK:మ్యాచ్‌కి వరణుడు అడ్డంకి?

- Advertisement -