బాహుబలి, బాహుబలి2 చిత్రాలతో హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయిన హీరో ప్రభాస్. ఐదు సంవత్సరాల పాటు బాహుబలి సినిమాకు మాత్రమే కమిట్ అయిన ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించనుంది. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు శ్రద్ధా కూడా డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ జనవరి 5 నుంచి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరుగుతుంది. భారీ యాక్షన్ సీన్స్‌ను అక్కడ చిత్రీకరించున్నారట. ఇందుకోసం హీరో ప్రభాస్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు.
ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా విడుదల చేసిన సాహో టీజర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే. డైలాగ్ మాసీగా ఉన్నా, దాన్ని తీసిన విధానం యమ క్లాసీగా ఉంది. ఇట్స్ షో టైమ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. మొత్తంగా బాహుబలి తర్వాత ప్రభాస్..సాహోతో మరోసారి మెప్పించడానికి తెగకష్టపడుతున్నాడు.