హ్యాపీ బర్త్‌ డే టు సుమధుర గాయని ‘ఎస్‌.పి.శైలజ’

839
- Advertisement -

గాయనిగా తనదైన బాణీ పలికించిన ఎస్పీ శైలజ అభినేత్రిగానూ అలరించారు… డబ్బింగ్ లోనూ భళా అనిపించారు… పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు పిన్నవయసులోనే గాయనిగా తనదైన బాణీ పలికించారు ఎస్పీ శైలజ… అన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకునిగా జైత్రయాత్ర చేస్తున్న సమయంలోనే శైలజ సైతం గాయనిగా తనదైన బాణీ పలికించారు… ‘ఎర్రమల్లెలు’లో శైలజ పాడిన “నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగా…” గీతం ఈ నాటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది…ఇవాళ ఎస్పీ శైలజ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

శ్రీపతి పండితారాధ్యుల(ఎస్పీ) శైలజ నెల్లూరు జిల్లాలోని కోనేటప్పపేటలో జన్మించారు. తండ్రి ఎస్పీ సాంబమూర్తి హరికథల్లో ప్రావీణ్యం ఉండడంతో ఇంట్లో అందరికీ సంగీతంపై ఆసక్తి ఎక్కువే. సంప్రదాయం పాటించే కుటుంబం కావడంతో వాళ్ల నాన్న ఆడపిల్లల్ని బయట పాడించేవారు కాదట. శైలజ మాత్రం స్కూల్లో చదివేటప్పుడు తల్లి ప్రోత్సాహంతో అక్కడ జరిగే పోటీల్లో, డ్రామాల్లో జిల్లా స్థాయిలో పాటలు పాడుతుండేవారు. శైలజకు ఐదారేళ్లు వచ్చే నాటికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా రంగంలో ఉన్నారు.

sudhakar

1977లో మద్రాసులో తొలిసారిగా ‘మార్పు’ సినిమాలో తన సోదరితో కలిసి ‘ఇద్దరం మేమిద్దరం’ అనే పాటను పాడారు శైలజ.ఈ పాటతో తెలుగు, తమిళంలో వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి.అలా ‘శివరంజని’, ‘ప్రాణం ఖరీదు’, మనవూరి పాండవులు’, ‘శంకరాభరణం’, ‘సీతాకోకచిలుక’, ‘సితార’, ‘సాగరసంగమం’ ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘రుద్రవీణ’, ‘సూత్రధారులు’, ‘అన్నమయ్య’ ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాల్లో తన పాటలతో శ్రోతలను మెప్పించారు.

దర్శకులు జంధ్యాల సూచనతో ‘శుభలేఖ’ సుధాకర్‌…శైలజను వివాహామాడారు. వీరికి ఒక కుమారుడు-శ్రీకర్‌. గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో మైలురాళ్లు అందుకున్న శైలజకు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కోరుకుంటోంది.

శైలజ టాప్‌ -5

              పాట                                                              చిత్రం
వూటే మంత్రము మనసే బంధము                         సీతాకోక చిలుక
వేదం అణువణువున నాదం                                  సాగర సంగమం
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నల పైటేసి                   సితార
నిగమా నిగమాంతర                                               అన్నమయ్య
దమ్మం శరణం గచ్ఛామి                                        స్వాతిముత్యం
వేవేలా గోపమ్మలా మువ్వా గోపాలుడే                    సాగర సంగమం
నాంపల్లి స్టేషన్‌ కాడా రాజాలింగం                           ఎర్రమల్లెలు
లాలూ దర్వాజ కాడా లష్కర్‌                                 మొండి మొగుడు పెంకి పెళ్లాం
మాఘమాస వేళలో                                                 జాతర
ముడు బురుజుల కోట మురిపాల తోట                       సూత్రధారి

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా…

చిత్రం                                                            నటి
వసంత కోకిల(83)                                       శ్రీదేవి
గుణ (1991)                                                 రేఖ
నిన్నే పెళ్లాడతా(1996)                                 టబూ
ఆవిడ మా ఆవిడే(1998)                               టబూ
మురారి(2001)                                      సొనాలి బింద్రే

- Advertisement -