ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూశారు.మైసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జానకి పూర్తి పేరు విష్టా జానకి. దక్షిణాది భాషల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వేలాది పాటలను పాడారు. ఆమెను అభిమానులు ముద్దుగా ‘గానకోకిల’, ‘జానకమ్మ’ అని పిలుచుకుంటారు.
ఏప్రిల్ 23, 1938న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయత్తు’ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. తెలుగులో ‘ఎమ్మెల్యే’ (1957) ఆమె మొదటి సినిమా. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరీర్‌లో దాదాపు 48,000 పైగా పాటలు పాడారు.
చిన్న పిల్లల గొంతు దగ్గర నుండి నేటి తరం వరకు ఏ వయసు వారికైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు.ఆమె ప్రతిభకు గానూ 4 జాతీయ అవార్డులు, 30కి పైగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నంది మరియు ఇతర అవార్డులు దక్కాయి. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొంటూ ఆమె నిరభ్యంతరంగా తిరస్కరించారు.
2016లో కన్నడ సినిమా ‘ప్రవాసి’ లోని ఒక పాటతో మరియు 2017లో ఒక తెలుగు ప్రైవేట్ సాంగ్‌తో ఆమె తన సుదీర్ఘ గాన ప్రస్థానానికి అధికారికంగా విరమణ ప్రకటించారు.
Also Read:స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు

