రైతు బీమా…కొత్త పాస్‌ బుక్స్‌ వచ్చిన వాళ్లకు చాన్స్!

639
rythu bandhu
- Advertisement -

రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 2021 ఆగస్టు 13వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం కింద ఈ ఏడాది 32.73 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3,486.90 చొప్పున మొత్తం రూ.1141.44 కోట్లను ప్రభుత్వమే బీమా సంస్థకు ప్రీమియంగా చెల్లించింది. కొత్తగా 2.23 లక్షల మంది రైతులు కొత్తగా ఈ పథకంలో చేరుతున్నారు.

పట్టాదారు పాసుపుస్తకం ఉండి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న రైతులు బీమాకు అర్హులు. పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డుతో దరఖాస్తు నింపి వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి ఏఈవోలకు అందించాలి. ఏఈవోలు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రైతు మరణిస్తే రూ. 5 లక్షల బీమా వర్తించేలా ఎల్‌ఐసీ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

గతేడాది నమోదు చేసుకున్న రైతుల్లో కొందరి వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అయితే ఈ సారి పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డుల్లోని వివరాలు తప్పుగా నమోదైతే సరి చేసే అవకాశం కల్పించారు. క్షేత్ర స్థాయి అధికారులకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు.

- Advertisement -