సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్

3
- Advertisement -

సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు.

ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు , పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు రేవంత్. రైతు పండుగలో ప్రత్యక్షంగా పాల్గొన్న రైతాంగం, రాష్ట్ర వ్యాప్తంగా 568 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది రైతులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లించేది గ్యారెంటీ. ఈ విషయంలో ఎవరినీ నమ్మకండి. రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి , మంత్రులు తుమ్మల , పొంగులేటి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాం అన్నారు. ఈ నెలలో జరిగే శాసనసభ సమావేశాల్లో విధివిధానాలపై చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు. రైతు భరోసా పథకం కొనసాగుతుందన్నారు.

Also Read:సంతోష్ కుమార్‌కు విశిష్ట పురస్కారం..

ప్రభుత్వ పరంగా వాస్తవాల ప్రాతిపదికన కొన్ని అంశాలు చర్చించుకుని ముందుకు వెళ్లడం ద్వారా రైతాంగానికి, మహిళలకు, విద్యార్థినీ విద్యార్థులకు ఒక మంచి పాలన అందించడం సాధ్యమవుతుంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో 69 వేల కోట్ల అప్పులు ఉండేవన్నారు. సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పుపై అసలు, మిత్తి కలిపి ప్రతి నెలా 6,500 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అప్పు ఉందన్న సంగతి ఆ పదేండ్లలో ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులుగానీ, రాజకీయ విశ్లేషకులుగానీ ఆర్థిక మంత్రిగానీ ప్రజలకు వాస్తవాలు వెల్లడించలేదు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి తర్వాత వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో ఆస్తులు, అప్పులు, విద్యుత్, సాగునీటి రంగాలపై శ్వేతపత్రం విడుదల చేశాం. ఆ లెక్కల ప్రకారం 7 లక్షల కోట్ల అప్పులు తేలాయి. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా క్షీణించిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

- Advertisement -