రైతు భరోసా పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. రైతు భరోసా పై సబ్ కమిటీ నివేదిక రెడి కాగా ఈనెల 4న జరిగే క్యాబినెట్ లో చర్చకు రానుంది క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరిగింది.
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉండగా జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. సుమారు 68 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. పది ఎకరాల పైన ఉన్న రైతులు సుమారు 92000…గత ప్రభుత్వంలో 21 వేల కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు.
గత తప్పిదాల వల్ల అనర్హులకు లబ్ధి చేకూరిందని… రాళ్లు, గుట్టలు, ఫీల్డ్ మీద లేకుండా రికార్డులో ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చారన్నారు. అనర్హులను తొలగిస్తే లబ్ధిదారుల సంఖ్య తగ్గనుంది.
Also Read:రేవంత్ రెడ్డి..రైతు వ్యతిరేకి:ఎమ్మెల్సీ కవిత