సాగుచేసే ప్రతిభూమికి పెట్టుబడి:హరీష్‌

236
Rythu Bandhu scheme will benefit farmers says Harish Rao
- Advertisement -

నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన హరీష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. సాగుచేసే ప్రతిభూమికి పెట్టుబడి పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామంలో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్ టున్నుల సామర్ధ్యం గల గోదాములకు భూమి పూజ చేశారు. పెన్‌పహాడ్ మండలం భక్తలాపురం దగ్గర శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులను మంత్రులు హరీశ్‌రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు…రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ అభిమతమని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నల్లగొండ జిల్లాలో ఎక్కడ చుసిన ధాన్యం రాశులె కనిపిస్తున్నాయని చాలా ఆనందంగా ఉందన్నారు. 24 గంటల విద్యుత్‌తో వ్యవసాయంలో అద్భుతం ఆవిష్కృతమైందన్నారు.

minister harish rao

సాగర్ కింద వారబందితో రైతులందరికి నీరిచ్చామని స్ఫష్టం చేశారు. రానున్న రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద సాగు నీరు ఇస్తామని… 98 శాతం పనులు పూర్తికావొచ్చాయని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు ఇబ్బంది కాకుడదని గోదాంలను నిర్మించామని తెలిపారు. నకేరేకల్‌లో నిమ్మ మార్కెట్ ప్రారంభిస్తామని నల్లగొండలో బత్తాయి మార్కెట్ పనులు పూర్తి కావొచ్చాయని చెప్పారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎస్సారెస్పీ కాల్వల్లో అవినీతి పారిందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఫేజ్ -2 పనుల్లో అడుగడుగునా అవినీతి జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలకు మహర్దశ వచ్చిందన్నారు. వచ్చే యాసంగీలో ప్రాజెక్టు చివరి భూములకు నీరందిస్తామని హామి ఇచ్చారు.

harish rao

- Advertisement -