మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ని ఏర్పర్చుకున్నారు హీరో కార్తికేయ. ఆర్ఎక్స్100 సినిమాతో బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ దాదాపు రూ.20 కోట్లపైగా వసూళ్లు రాబట్టింది. అర్జున్ రెడ్డి సినిమా తరువాత యూత్ లో మళ్లీ అంతటి క్రేజ్ ని సంపాదించుకుంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంగా వహించగా.. కథానాయికగా పాయల్ రాజ్ పుత్ నటించింది. ప్రస్తుతం కార్తికేయ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం.. ఇక చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. ఆయన ప్రతి సినిమా చూసేవాడిని, ఇంద్ర సినిమా డైలాగ్ లు, డ్యాన్స్ లు ప్రాక్టీస్ చేసేవాడిని, ఆ పిచ్చితోనే ఇంట్లో అమ్మానాన్నలను ఒప్పించి నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆ తరువాత ఎక్కడ ఆడిషన్స్ ఉంటే అక్కడ వాలిపోయేవాడిని, త్వరలో సినిమా స్టార్ట్ అవుతుందని వారి చుట్టూ తిప్పుకునే వారు. తీరా చూస్తే రూ. లక్ష తక్కువ పడ్డాయి అవి ఉంటే షూటింగ్ వెళ్లి పోవచ్చు అనే వారు.
అలా చాలా మందికి ఇచ్చి మోస పోయాను. అలా తిరుగుతున్న సమయంలోనే దర్శకుడు అజయ్ భూపతి పరిచయం అవడం.. నేను హీరో కావాలన్న నా కల నెరవేరడం జరిగిపోయాయి. ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.