మొక్కలు నాటిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్ రూతాపర్ణ పాండా…

221
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇండియన్ బాట్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఒడిశా రాష్ట్రం కటక్ లోని తన నివాసంలో ఇండియన్ బాట్మింటన్ ప్లేయర్ రూతాపర్ణ పాండా మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల నెలతల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అలాగే ఈ ఛాలెంజ్ కి తనని నామినేట్ చేసిన కోచ్ అరుణ్ విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురికి మొక్కలు నాటల్సిందిగా ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ అందుకున్న వారిలో రితుపర్ణదాస్,చిరాగ్ శెట్టి,అలాగే శ్లోక్ రామచంద్రన్ ఉన్నారు.

- Advertisement -