- Advertisement -
రష్యా అధ్యక్షుడిగా మరోసారి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు వ్లాదిమిర్ పుతిన్. మూడు రోజుల పాటు పోలింగ్ జరుగగా 60శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.97 శాతం ఓట్లతో పుతిన్ గెలుపొందారు.
ఈ సందర్భంగా పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా, నాటో మిలిటరీ కూటమి మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలో అన్నీ సాధ్యమేనన్నారు.ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
ఎన్నికలు జరుగుతున్న సమయంలో రష్యాపై ఉక్రెయిన్ దాడులను తీవ్రం చేయగా సరిహద్దు ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read:మోడీ – జగన్.. మధ్య వైరం?
- Advertisement -