భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై రష్యా!

6
- Advertisement -

భారత్ తనకు నచ్చిన ఏ దేశం నుంచైనా ముడిచమురు కొనుగోలు చేసుకోవచ్చని రష్యా బుధవారం స్పష్టం చేసింది. చమురు సరఫరాదారులను విభిన్నంగా మార్చుకోవాలన్న న్యూఢిల్లీ ప్రయత్నం కొత్తది కాదని, అది రష్యాను లక్ష్యంగా చేసుకున్నది కాదని మాస్కో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసి, అమెరికా మరియు అవసరమైతే వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అంగీకరించారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రష్యా ఈ ప్రకటన చేసింది.

క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, రష్యా ఎప్పుడూ భారత్‌కు ఏకైక ఇంధన సరఫరాదారు కాదని తెలిపారు.భారత్ ఎప్పటినుంచో ఇతర దేశాల నుంచి కూడా చమురు, పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. ఇందులో కొత్తదేమీ లేదు అన్నారు.

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా, ప్రపంచ పరిస్థితుల మార్పులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వనరులను విస్తరిస్తోందని, ప్రజల ఇంధన భద్రత కోసం ఇది అవసరమని పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు భారత్ నుంచి అధికారిక సమాచారం ఏదీ తమకు అందలేదని పెస్కోవ్ చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ఒకరోజు ముందే కూడా స్పష్టం చేశారు.

Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

ఇదిలా ఉండగా, రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా, హైడ్రోకార్బన్ వాణిజ్యం ఇరు దేశాలకు లాభదాయకమని చెప్పారు.రష్యా హైడ్రోకార్బన్లను భారత్ కొనుగోలు చేయడం ఇరువురికీ మేలు చేస్తుంది. ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వానికి ఇది దోహదపడుతుంది. భారత భాగస్వాములతో సహకారాన్ని కొనసాగించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ఆమె తెలిపారు. భారత్‌కు రోజుకు సుమారు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు సరఫరా జరుగుతుందని, ఈ స్థాయిలో సరఫరా చేయడం అమెరికాకు సులభం కాదని యుష్కోవ్ తెలిపారు.ఈ చర్చలను పూర్తిగా అమెరికా విజయం లాగా చూపించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -