చంద్రుడిపై కూలిన రష్యా లూనా-25..

37
- Advertisement -

చంద్రుడిపై కాలు మోపేందుకు రష్యా చేపట్టిన ప్రయోగం విఫలమైంది. చంద్రుడికి కూతవేటు దూరంలో రష్యా ప్రయోగించిన లూనా – 25 సురక్షితంగా ల్యాండ్ కాలేదు. దీనిని అఫిషియల్‌గా ప్రకటించింది రష్యా.

లూనా-25తో సంబంధాలు ఇవాళ మధ్యాహ్నం 2.57 గంటలకు పూర్తిగా తెగిపోయాయని, దాని నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. రాకెట్లోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని…ఆ తర్వాత కొన్ని గంటలకే తమ ప్రయోగం విఫలమైందని వెల్లడించింది.

ఇప్పుడు అందరి దృష్టి భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 పై ఉండగా ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది చంద్రయాన్ 3.

- Advertisement -