- Advertisement -
ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ను ప్రారంభించింది రష్యా. మిలిటరీ ఆరేషన్ చేపట్టినట్లు ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ …ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని…ఒకవేళ వస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చిచెప్పారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అన్యాయమైన దాడులతో ఉక్రెయిన్ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రష్యా దాడికి ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు.
- Advertisement -