ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపుగా 8 నెలలు కావాస్తోంది. పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతుంది. రష్యాకు పశ్చిమ భాగంలో, ఉక్రెయిన్‌కు తూర్పు భాగంలో ఉన్న జపోరిజియా, ఖేర్సన్, లుహాన్స్క్, దెబెట్స్క్ స్వతంత్ర ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్టు క్రెమ్లిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు రష్యాలో విలీనమయ్యాయని అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ప్రకటించారు.
క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో జరిగిన సమావేశంలో నాలుగు ప్రాంతాలు అధిపతులు రష్యాలో విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. వ్యూహత్మక భాగమైన ఈ నాలుగు ప్రాంతాలను అక్రమించుకోవడం అంతర్జాతీయ చట్ట విరుద్దమని ఇప్పటికే హెచ్చరించిన లేక్కచేయలేదు.
ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ఇకపై నాలుగు ప్రాంతాలపై ఏదైనా దాడి జరిగినా.. అది రష్యాపైనే దాడి జరిగినట్టుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో కలిసిందని పుతిన్ పేర్కొన్నారు. మా భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమన్నారు. అయితే, పుతిన్ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. పుతిన్ ప్రకటన పనికి రానిదంటూ కొట్టిపడేశారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరన్నారు.