ఉక్రెయిన్‌ పై మరోసారి రష్యా దాడి

81
ukraine
- Advertisement -

ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజున రష్యా దాడులతో రెచ్చిపోయింది. డ్నిప్రోపెట్రోవ్‌స్కీ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు గాయపడ్డారి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు.

యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారత్‌ 12వ మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మందులతో పాటు తీవ్ర గాయాలకు బ్యాండెజీలతో పాటు 24 రకాలు పంపనున్నట్లు తెలిపారు.

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం యూరప్‌కే పరిమితం కాదని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతపై ఆందోళనలు పెంచుతోందని రుచిరా పేర్కొన్నారు.

- Advertisement -