- Advertisement -
చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో రూపాయ విలువ పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 80.05కి చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరలు పెరిగిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం… రూపాయి విలువ బలహీనం కావడానికి కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.
బ్రిటిష్, జపాన్, యూరో కరెన్సీ విలువ పతనం కూడా రూపాయి కన్నా ఎక్కువగా ఉంది. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో.. రూపాయి విలువ తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ మార్కెట్ నుంచి 14 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు.
- Advertisement -