- Advertisement -
రూపాయి విలువకి ఇప్పుడు బ్యాడ్ డేస్ స్టార్టయినట్టుంది. నిన్నటి సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ , మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల గరిష్ఠానికి చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది.
అయితే అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలకు పడిపోయింది. చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడడం రూపాయి క్షీణతకు దారితీస్తోంది.
అలాగే చైనా-అమెరికాల మధ్య వాణిజ్య భయాలు కూడా దేశీయ కరెన్సీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.94 వద్ద ట్రేడవుతోంది.
- Advertisement -