Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

11
- Advertisement -

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు రెడీ అవుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో రివ్యూ నిర్వహించిన రేవంత్…రుణమాఫీపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక ఈ నెల 21 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుండగా ప్రధానంగా రుణమాఫీపైనే చర్చించే అవకాశం ఉంది.

ఎవరెవరికి రుణమాఫీ చేయాలి, నిధుల సమీకరణకు ఏం చేయాలనే విషయంపై కూలంకుశంగా చర్చించనున్నారు. ఇప్పటికే మద్యం ధరల పెంపు, భూముల ధరలు పెంచేదానిపై కసరత్తు జరుగుతోంది.

ఇక కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం…జులై 17 నుండి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. జులైలో ప్రారంభించి.. ఆగస్టు 15 కల్లా పూర్తి చేయనున్నారు. పీఎం కిసాన్‌ పథకంలో ఉన్న రూల్స్ ప్రకారమే మొత్తం మూడు విడతల్లో అప్పులు తీర్చేయనున్నారని తెలుస్తోండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -